mammootty: వైఎస్ఆర్ బయోపిక్ కి సన్నాహాలు .. జగన్ భార్య పాత్రలో కీర్తి సురేశ్?

  • 30 కోట్ల బడ్జెట్ తో వైఎస్ఆర్ బయోపిక్
  • ప్రధానమైన పాత్రలో మమ్ముట్టి 
  • పరిశీలనలో 'యాత్ర' టైటిల్  

వై.ఎస్.ఆర్. బయోపిక్ కి సంబంధించిన సన్నాహాలు చకచకా జరిగిపోతున్నాయి. 'ఆనందో బ్రహ్మ' సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపును తెచ్చుకున్న మహి వి. రాఘవ్ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాలో వైఎస్ఆర్ గా మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించనున్నట్టు తెలుస్తోంది.

ఇక జగన్ పాత్రలో తమిళ స్టార్ హీరో సూర్య చేయనున్నట్టు ప్రచారం జరుగుతోంది. జగన్ భార్య భారతి పాత్రలో కీర్తి సురేశ్ నటించే అవకాశం వున్నట్టుగా చెబుతున్నారు. 30 కోట్ల బడ్జెట్ తో విజయ్ చిల్లా .. దేవిరెడ్డి శశి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి 'యాత్ర' అనే టైటిల్ ను ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర .. ఆయన ముఖ్యమంత్రి పదవిని చేపట్టడం వరకూ ఈ కథ కొనసాగుతుందని అంటున్నారు.   

mammootty
keerthi suresh
surya
  • Loading...

More Telugu News