Chandrababu: అనుక్షణం అప్రమత్తంగా ఉండండి: ఎంపీలకు చంద్రబాబు సూచన

  • రాబోయే ఇబ్బందులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి
  • పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లండి
  • మనకు ఎవరిపైనా కోపం లేదు

మనకు ఇవ్వాల్సిన నిధుల్లో మాత్రమే కేంద్రం కోతలు పెడుతోందని... ఇతరులకు ధారాళంగానే ఇస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని, మనోభావాలను గాయపరుస్తున్నారని చెప్పారు. ఢిల్లీలో ఉన్న ఎంపీలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడుతూ, ఇప్పటికే మన పోరాటం ప్రజల్లోకి బలంగా వెళ్లిందని చెప్పారు. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.

నిధుల కోసం పదేపదే కేంద్రం చుట్టూ తిరిగినా... ఫలితం దక్కలేదని చెప్పారు. టీడీపీ ఎంపీలంతా జాగ్రత్తగా వ్యవహరించాలని, అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాబోయే ఇబ్బందులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పారు. తమకు మోదీ, బీజేపీ, ఎన్డీయే, యూపీఏలపై కోపం లేదని... ఏపీకి జాతీయ పార్టీలు అన్యాయం చేస్తున్నాయనేదే తమ బాధ అని తెలిపారు.

Chandrababu
Telugudesam
mps
BJP
NDA
  • Loading...

More Telugu News