chenni super kings: ధోనీ, శ్రీనివాసన్ మళ్లీ వచ్చేశారు... చెన్నై సూపర్ కింగ్స్ ఈజ్ బ్యాక్!

  • ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు
  • ప్రాక్టీస్ లో దేశవాళీ ఆటగాళ్లు
  • టోర్నీలు ముగియగానే జట్టుతో చేరనున్న విదేశీ ఆటగాళ్లు

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మళ్లీ రంగప్రవేశం చేసింది. రెండేళ్ల నిషేధం ముగియడంతో ఈ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ బరిలోకి దిగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మద్రాసులో తొలి ప్రాక్టీస్ సెషన్ లో చెన్నై సూపర్ కింగ్స్ దేశవాళీ ఆటగాళ్లు పాల్గొన్నారు. విదేశీ ఆటగాళ్లు ఆయా దేశాల టోర్నీలు ముగియగానే జట్టుతో చేరుతారు.

ఏప్రిల్ 10న చెన్నై సూపర్ కింగ్స్ తొలి మ్యాచ్ ఆడనుంది. ప్రాక్టీస్ కు ధోనీతో పాటు జట్టు యజమాని శ్రీనివాసన్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాసన్ తో ధోనీ ముచ్చటించాడు. గతంలో ధోనీ సారధ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐపీఎల్ లో అత్యుత్తమ జట్లలో ఒకటిగా నిలిచిన సంగతి తెలిసిందే.

chenni super kings
chennai
ipl
Cricket
  • Loading...

More Telugu News