CBI: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జనసేనలోకి వస్తారన్న ఊహాగానాలు... టచ్‌లో బీజేపీ?

  • జగన్ అక్రమాస్తుల కేసు దర్యాప్తుతో ఒక్కసారిగా వెలుగులోకి
  • స్వచ్ఛంద ఉద్యోగ విరమణకు దరఖాస్తు
  • త్వరలోనే రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారంటూ ఊహాగానాలు

స్వచ్ఛంద పదవీ విరమణకు  దరఖాస్తు చేసి వార్తల్లోకి ఎక్కిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీలో చేరనున్నట్టు ప్రచారం జరుగుతోంది.  మరోవైపు ఆయనను తమ పార్టీలోకి తీసుకొచ్చేందుకు బీజేపీ నేతలు కూడా ఆయనతో టచ్‌లో ఉన్నట్టు చెబుతున్నారు.

కర్నూలు జిల్లా శ్రీశైలానికి చెందిన లక్ష్మీనారాయణ 1990 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి. జగన్ అక్రమాస్తుల కేసు, ఓబుళాపురం మైనింగ్ కేసుల దర్యాప్తుతో ఒక్కసారిగా ఆయన వెలుగులోకి వచ్చారు. సీబీఐ జాయింట్ డైరెక్టర్‌ (జేడీ)గా జగన్ కేసును దర్యాప్తు చేస్తున్న సమయంలో ఆయన పేరు మార్మోగిపోయింది. డిప్యుటేషన్ తర్వాత తిరిగి ఆయన మహారాష్ట్ర వెళ్లిపోయారు. మరోవైపు స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లోనూ ఆయన చురుగ్గా ఉన్నారు. ఏపీ, తెలంగాణలో పలు కార్యక్రమాలలో ఆయన పాల్గొన్నారు.

లక్ష్మీనారాయణ స్వచ్ఛంద ఉద్యోగ విరమణ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు. రాజకీయాల్లోకి వచ్చేందుకే ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసినట్టు ఊహాగానాలు ఊపందుకున్నాయి. లక్ష్మీనారాయణతో బీజేపీ నేతలు కూడా టచ్‌లో ఉన్నట్టు చెబుతున్నారు. ఆయనను ఎలాగైనా పార్టీలో చేర్చుకునేందుకు పావులు కదుపుతున్నట్టు సమాచారం. ఆయన కనుక రాజకీయాల్లోకి వస్తే టీడీపీకే మంచిదని ఆ పార్టీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. కాగా, తన రాజకీయ రంగ ప్రవేశంపై వస్తున్న వార్తలను లక్ష్మీనారాయణ కొట్టిపడేశారు.

  • Loading...

More Telugu News