Rajya Sabha: రేపటి రాజ్యసభ ఎన్నికలకు సర్వం సిద్ధం

  • రేపు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వ‌ర‌కు ఎన్నిక‌లు
  • సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు
  • 58 రాజ్యసభ స్థానాలకు 16 రాష్ట్రాల్లో ఎన్నిక‌లు
  • ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి మూడేసి రాజ్య‌స‌భ సీట్ల‌కు ఎన్నిక‌లు

రాజ్య‌స‌భ ఎన్నిక‌ల‌కు స‌ర్వం సిద్ధ‌మైంది. రేపు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వ‌ర‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఆయా రాష్ట్రాల ఎమ్మెల్యేలు సింగిల్ ట్రాన్స్‌ఫరబుల్ ఓటుతో దామాషా ప్రకారం పరోక్ష పద్ధతిలో ఓటు వేయ‌నున్నారు. అనంత‌రం గంట సేప‌టికే ఓట్ల లెక్కింపు నిర్వ‌హించి ఫలితాలు వెల్లడించే అవ‌కాశం ఉంది. ఏప్రిల్లో ఖాళీ అవబోతున్న 58 రాజ్యసభ స్థానాలకు 16 రాష్ట్రాల్లో ఈ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. వీటిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి మూడేసి రాజ్య‌స‌భ సీట్ల‌కు కూడా ఎన్నిక‌లు జరుగుతున్నాయి.  
 
కాగా, ఈ ఎన్నిక‌ల బ‌రిలో తెలంగాణ‌లో టీఆర్ఎస్ నుంచి ముగ్గురు, కాంగ్రెస్ నుంచి ఒక‌రు పోటీ చేస్తున్నారు. ఎంఐఎం పార్టీ టీఆర్‌ఎస్ కు మద్దతుగా ఓటు వేయనుంది. తెలంగాణలో ఎన్నికలకు దూరంగా ఉండాలని టీడీపీ, బీజేపీ నిర్ణయించుకున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో నోటాకు కూడా అవ‌కాశం ఇచ్చారు.

  • Loading...

More Telugu News