rajendra prasad: సినిమావాళ్లపై నేను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నాను: ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్‌

  • 'ఏ‌పీ ప్రజల డబ్బులు తింటోన్న సినీ పరిశ్రమ' అంటూ రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలు
  • ప్రత్యేక హోదా కోసం ఎందుకు నిరసన చేయట్లేదంటూ నిలదీత
  • సినిమావాళ్లను బాధపెట్టాలన్న ఉద్దేశంతో అలా మాట్లాడలేదని తాజాగా వివరణ

ఆంధ్రప్రదేశ్‌ ప్రజల డబ్బులు తింటోన్న సినీ పరిశ్రమ, ప్రత్యేక హోదా కోసం ఎందుకు నిరసన చేయట్లేదంటూ టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై తమ్మారెడ్డి భరద్వాజ, టీడీపీ ఎంపీ మురళీ మోహన్, సినీ నటి కవితతో పాటు పలువురు ప్రతి విమర్శలు చేయడంతో బాబూ రాజేంద్రప్రసాద్... తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు.

తాను ఎవరినీ బాధపెట్టాలన్న ఉద్దేశంతో అలా మాట్లాడలేదని, ముఖ్యమంత్రి చంద్రబాబుకి అండగా నిలవాలని చేసిన వ్యాఖ్యలను సినిమావారు అర్థం చేసుకోవాలని అన్నారు. సినిమా వాళ్లు ప్రత్యేకహోదా కోసం పోరాడితే ఏపీకి మేలు జరుగుతుందన్న ఉద్దేశంతోనే అలా అన్నానని తెలిపారు.   

rajendra prasad
Telugudesam
Special Category Status
  • Loading...

More Telugu News