pavan: నితిన్ మూవీ ఫంక్షన్ కి ముఖ్య అతిథిగా పవన్

  • నితిన్ హీరోగా 'ఛల్ మోహన్ రంగ'
  • కథానాయికగా మేఘా ఆకాశ్ 
  • ఈ నెల 25న ప్రీ రిలీజ్ ఈవెంట్  

పవన్ కల్యాణ్ కి నితిన్ వీరాభిమాని అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన సినిమాల్లో పవన్ ప్రస్తావన వచ్చేలా చూసుకోవడం .. తన సినిమా ఫంక్షన్స్ కి పవన్ ను ఆహ్వానించడం నితిన్ కి అలవాటే. అందువల్లనే పవన్ అభిమానులు .. నితిన్ సినిమాల సక్సెస్ లో పాలుపంచుకుంటూ వుంటారు.

కాగా, నితిన్ తాజా చిత్రంగా 'ఛల్ మోహన్ రంగ' రూపొందుతోన్న సంగతి తెలిసిందే. కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో, కథానాయికగా మేఘా ఆకాశ్ నటిస్తోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 25వ తేదీన గ్రాండ్ గా నిర్వహించనున్నారు. ఈ వేడుకకి ముఖ్య అతిథిగా పవన్ కల్యాణ్ వస్తున్నట్టుగా నితిన్ ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. ఈ సినిమాకి పవన్ కూడా ఒక నిర్మాత అనే సంగతి తెలిసిందే. ఇక వేడుక ఏ ప్రాంతంలో .. వేదిక ఏ ప్రదేశంలో అనే వివరాలను త్వరలోనే తెలియజేస్తామని నితిన్ చెప్పాడు.  

pavan
nithin
megha akash
  • Error fetching data: Network response was not ok

More Telugu News