akhil: అఖిల్ తదుపరి సినిమా కోసం రంగంలోకి తమన్

  • 'తొలిప్రేమ' దర్శకుడితో అఖిల్ 
  • అదే టీమ్ నుంచి నిర్మాత .. సంగీత దర్శకుడు 
  • త్వరలోనే పూర్తి వివరాలు    

అక్కినేని అభిమానులంతా అఖిల్ తదుపరి సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రెండవ సినిమా విషయంలో జరిగిన ఆలస్యం ఈ సినిమా విషయంలో జరగకూడదనే ఉద్దేశంతో, దర్శకుడు వెంకీ అట్లూరికి అఖిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 'తొలిప్రేమ'తో తొలి ప్రయత్నంతోనే వెంకీ అట్లూరి హిట్ కొట్టడంతో ఆయనపై అఖిల్ గట్టి నమ్మకమే పెట్టుకున్నాడు.

అందువలన ఆయన వినిపించిన కథ చేయడానికి ఓకే చెప్పేశాడు. ఇక 'తొలిప్రేమ' సక్సెస్ లో తమన్ అందించిన పాటలు కూడా ప్రధానమైన పాత్రను పోషించాయి. అందువలన అఖిల్ తన మూడవ సినిమాకి తమన్ నే తీసుకున్నాడనేది తాజా సమాచారం. ఇక ఈ సినిమాను నిర్మించనున్నది కూడా 'తొలిప్రేమ' నిర్మాత బీవీఎస్ ఎన్ ప్రసాద్ కావడం మరో విశేషం. కథానాయికతో పాటు ఇతర విషయాల్లో త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం వుంది. 

akhil
thaman
  • Loading...

More Telugu News