Air Force: ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగాల పేరుతో నకిలీ వెబ్‌సైట్...ఎఫ్ఐఆర్ నమోదు

  • ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగాలకు నకిలీ వెబ్‌సైటును సృష్టించిన దుండగులు
  • వెబ్‌సైటును గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆర్మీ అధికారి
  • కొనసాగుతున్న దర్యాప్తు

భారత వైమానిక దళంలో ఉద్యోగాలంటూ ఓ నకిలీ వెబ్‌సైటును నిర్వహిస్తున్న గుర్తుతెలియని వ్యక్తులపై ఢిల్లీ పోలీసులు ఈ రోజు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వైమానిక దళానికి చెందిన ఓ అధికారి ఈ నకిలీ వెబ్‌సైటును గుర్తించారు. దీనికి సంబంధించి ఈ నెల 16నే ఆయన ఫిర్యాదు చేశారు. ఐటీ చట్టం కింద పోలీసులు ఈ కేసు నమోదు చేశారు.

వెబ్‌సైటును రూపొందించిన వారు వైమానికదళంలో వివిధ ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానించారు. దీని గురించి వింగ్ కమాండర్ మంజిత్ సింగ్ మాట్లాడుతూ..."సదరు వెబ్‌సైటులో ఎయిర్‌ఫోర్స్ రికార్డు కార్యాలయాల్లో సివిలియన్ గ్రూప్ సీ పోస్టుల్లోని ఓ ఖాళీకి సంబంధించిన దరఖాస్తు ఫారాన్ని ఉంచారు" అని ఆయన చెప్పారు. న్యూఢిల్లీలోని ఆర్మీ ప్రధాన కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న సింగ్ ఈ నకిలీ వెబ్‌సైటు పేరును గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో ఉంది.

  • Loading...

More Telugu News