shivaji: పార్లమెంటులో రేపు జరగబోతున్నది ఇదే: హీరో శివాజీ

  • అవిశ్వాసంపై చర్చను చేపడతారు
  • కేంద్రం తరపున ఆరుగురు మాట్లాడతారు
  • చివరకు అవిశ్వాసం వీగిపోయిందని ప్రకటిస్తారు

లోక్ సభలో రేపు అవిశ్వాస తీర్మానంపై చర్చను చేపట్టబోతున్నారని హీరో శివాజీ అన్నారు. దీనికి సంబంధించి తనకు స్పష్టమైన సమాచారం అందిందని చెప్పారు. ఓ పక్కా ప్లాన్ ప్రకారం సభను నిర్వహించబోతున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తరపున ఆరుగురు వ్యక్తులు లోక్ సభలో మాట్లాడతారని... వారిలో ముగ్గురు ఇంగ్లీషులో, మరో ముగ్గురు తెలుగులో మాట్లాడతారని చెప్పారు.

ఈ ఆరు మంది కూడా అనర్గళంగా ధడ్ ధడ్ లాడిస్తారని... ఏపీకి అంతా చేసేశామని చెప్తారని తెలిపారు. మన ఎంపీలకు ఇంగ్లీషు పెద్దగా రాదనే భావన ఢిల్లీలో ఉందని అన్నారు. వీరంతా మాట్లాడిన తర్వాత అవిశ్వాసాన్ని వ్యతిరేకించే వారు చేయెత్తాలని స్పీకర్ అడుగుతారని, అనుకూలంగా ఉండేవారు చేయెత్తాలని అడుగుతారని చెప్పారు. చివరకు అవిశ్వాసానికి వ్యతిరేకంగా ఉండేవారే ఎక్కువగా కనిపిస్తున్నారంటూ... అవిశ్వాసం వీగిపోయిందని ప్రకటిస్తారని తెలిపారు. 

shivaji
no confidence motion
BJP
  • Loading...

More Telugu News