movie: సినిమా ధియేటర్లో సీట్ల మధ్య తల ఇరుక్కుని మరణించిన వ్యక్తి!

  • బర్మింగ్‌ హామ్‌ లో స్టార్‌ సిటీ ఎంటర్‌ టైన్‌ మెంట్‌ కాంప్లెక్స్‌ లోని వ్యూ థియేటర్‌ లో సినిమా చూసేందుకు వెళ్లిన వ్యక్తి
  • సినిమా సగంలో సీట్ల మధ్యలో పడిన సెల్ ఫోన్
  • ఫోన్ తీసుకునేందుకు వంగి ఫుట్ రెస్ట్ మీదపడడంతో ఇరుక్కుపోయిన వ్యక్తి

సినిమా చూసేందుకు థియేటర్‌కు వెళ్లిన వ్యక్తి ఎవరూ వూహించని విధంగా సీట్ల మధ్య తల ఇరుక్కుని ప్రాణాలు కోల్పోయిన చిత్రమైన ఘటన ఇంగ్లండ్‌ లో చోటుచేసుకుంది. దాని వివరాల్లోకి వెళ్తే... ఇంగ్లండ్ లోని బర్మింగ్‌ హామ్‌ లో స్టార్‌ సిటీ ఎంటర్‌ టైన్‌ మెంట్‌ కాంప్లెక్స్‌ లోని వ్యూ థియేటర్‌ లో సినిమా చూసేందుకు ఒక వ్యక్తీ తన జీవిత భాగస్వామితో కలిసి వెళ్లాడు. ‘గోల్డ్‌ క్లాస్‌’‌ లగ్జరీ టికెట్ తీసుకుని కూర్చుని సినిమా చూస్తుండగా, తన సెల్ ఫోన్ రెండు సీట్ల మధ్యలో పడిపోవడంతో దానిని తీసుకునేందుకు వంగాడు. ఇంతలో అక్కడున్న ఎలక్ట్రానిక్‌ ఫుట్‌ రెస్ట్‌ అతని తలపై పడింది. దీంతో తల ఇరుక్కుపోయింది.

ఆయనను బయటకు తీసేందుకు అతని భార్య సహాయం చేసినా ఉపయోగం లేకపోయింది. వెంటనే ఆమె థియేటర్ సిబ్బందికి ఫిర్యాదు చేయగా వారు కూడా అతనిని బయటకు తీసే ప్రయత్నం చేశారు. అయినా ఉపయోగం లేకపోవడంతో కుర్చీ కాలు విరగ్గొట్టి అతనిని బయటకు తీశారు. ఈ క్రమంలో ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఆందోళనతో ఆయనకు గుండెపోటు వచ్చింది. సీరియస్ కండిషన్‌ లో ఆయనను మార్చి 9న థియేటర్‌ నుంచి ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మార్చి 16న ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని థియేటర్ యాజమాన్యం తెలిపింది.

movie
england
burmingham
star city entartainment complex
view theater
  • Loading...

More Telugu News