reliance jio: రిలయన్స్ జియో బేసిక్ ఫోన్లో త్వరలోనే వాట్సాప్ సదుపాయం

  • ఇందుకోసం ప్రత్యేకంగా యాప్ అభివృద్ధి
  • ప్రస్తుతం పరీక్షల దశలో
  • వాబీటాఇన్ఫో సంస్థ వెల్లడి

రిలయన్స్ 4జీ బేసిక్ ఫోన్ యూజర్లకు త్వరలోనే మంచి రోజు రానుంది! ప్రస్తుతం ఈ ఫోన్లో వాట్సాప్ యాప్ సదుపాయం లేదు. దీన్ని తీసుకువచ్చే విషయమై వాట్సాప్ తో జియో చర్చలు జరుపుతుందున్న వార్తలు గతంలోనే వెలుగులోకి వచ్చాయి. ఇవి త్వరలోనే నిజం కాబోతున్నాయి.

వాట్సాప్ కేఏఐఓఎస్ కు సపోర్ట్ చేసే యాప్ ను రూపొందించే పనిలో ఉన్నట్టు ఆ సంస్థ వ్యవహారాలను విశ్లేషించే వాబీటా ఇన్ఫో పేర్కొంది. వాట్సాప్ కొత్త వెర్షన్ ను విడుదల చేసే ముందు పరీక్షిస్తుందన్న విషయం తెలిసిందే. ఇప్పుడు రిలయన్స్ జియో ఫోన్లను సపోర్ట్ చేసే యాప్ కూడా బీటా దశలో ఉందని వాబీటా ఇన్ఫో తెలిపింది. దీనివల్ల వాట్సాప్ కు కూడా ప్రయోజనమే. యూజర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది.

reliance jio
whatsapp
  • Loading...

More Telugu News