Pens: పెన్ను క్యాప్ లతో ప్రపంచ వ్యాప్తంగా పలు మరణాలు!
- పెన్ను క్యాప్ ల కారణంగా వందలాది మంది మృతి
- మింగితే గొంతులో ఇరుక్కునే క్యాప్ లు
- ఊపిరి ఆడేందుకే క్యాప్ లకు హోల్స్ ఏర్పాటు
- వెల్లడించిన అమెరికన్ అధ్యయన సంస్థ
కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్ల యుగం ప్రారంభమైన తరువాత పెన్నుల వాడకం తగ్గిపోయిందేమో కానీ, నేటికీ అక్కడక్కడ కొంతమంది పెన్నులను వాడుతున్న విషయం మనకు తెలుసు. అయితే, పెన్ను క్యాపుల కారణంగా ప్రతి సంవత్సరమూ వందలాది మంది చనిపోతున్నారని ఓ అమెరికన్ సంస్థ తన తాజా అధ్యయనంలో వెల్లడించింది.
పెన్నుల క్యాపులు ప్రాణాంతకమని, వాటి నుంచి వాడకందారుల ప్రాణాలను కాపాడేందుకే క్యాప్ లకు హోల్స్ పెడతారని పేర్కొంది. దీనిపై మరింత వివరణ ఇస్తూ, పలువురు పెన్నులను వాడే సందర్భంగా దాని క్యాప్ ను నోట్లో పెట్టుకుని మింగేస్తుంటారని, అది గొంతులో అడ్డుపడి ప్రాణాలు కోల్పోతుంటారని చెబుతూ, ఒకవేళ క్యాప్ గొంతులో ఇరుక్కున్నా, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది లేకుండా చూసేందుకే వాటికి రంధ్రాలు చేస్తారని వెల్లడించింది. ప్రాణాపాయాన్ని నివారించేందుకు పెన్నుల కంపెనీలు ఈ తరహా ఏర్పాటు చేస్తున్నాయని తెలిపింది. సో... ఇకపై పెన్ను కొనుగోలు చేయాలని వెళితే, క్యాప్ కు హోల్ ఉందా? లేదా? అన్న విషయాన్ని ఓ మారు పరిశీలించండి.