Parliament: పార్లమెంట్ లో అద్వానీని చుట్టుముట్టిన టీఆర్ఎస్ ఎంపీలు... ఎక్స్ క్లూజివ్ దృశ్యాలు!

  • రిజర్వేషన్ల కోటాను పెంచుకునే అధికారం కావాలంటున్న టీఆర్ఎస్
  • నిత్యమూ ఆందోళనలు చేస్తున్న టీఆర్ఎస్ ఎంపీలు
  • మద్దతు పలకాలని అద్వానీకి విన్నపం

తెలంగాణలో రిజర్వేషన్ల కోటాను నిర్ణయించుకునే అధికారం తమకే ఇవ్వాలంటూ, ఈ పార్లమెంట్ సెషన్ లో నిత్యమూ ఆందోళనలు చేస్తూ, పోడియంలో ప్లకార్డులు పట్టుకుని నిరసనలు తెలుపుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు, నేడు బీజేపీ సీనియర్ నేత అద్వానీని కలసి తమ గోడు విన్నవించుకున్నారు. సభలో అద్వానీ కూర్చున్న స్థానం వద్దకు వెళ్లిన ఎంపీలు, ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచేందుకు తమకు సహకరించాలని కోరారు. ఈ ఉదయం సభ వాయిదా పడిన తరువాత ఎంపీలు అద్వానీని కలిశారు. పార్లమెంట్ లో అద్వానీని చుట్టుముట్టిన టీఆర్ఎస్ ఎంపీల ఎక్స్ క్లూజివ్ దృశ్యాలు మీకోసం. 

  • Error fetching data: Network response was not ok

More Telugu News