Bollywood: పదేళ్ల తర్వాత కిరాక్ పాటతో బాలీవుడ్ బ్యూటీ రీఎంట్రీ

  • 1990ల్లో బాలీవుడ్‌ని ఓ ఊపు ఊపిన ఊర్మిళ మదోండ్కర్
  • దశాబ్దం తర్వాత ఇర్ఫాన్ ఖాన్ 'బ్లాక్ మెయిల్' చిత్రంలోని పాటతో పునరాగమనం
  • అమీర్‌తో చేసిన 'రంగీలా' చిత్రంతో నటిగా మంచి గుర్తింపు

1990ల్లో బాలీవుడ్ అందాల ముద్దుగుమ్మల్లో ఒకరైన ఊర్మిళ మదోండ్కర్ పదేళ్ల తర్వాత ఓ కిరాక్ పాటతో రీఎంట్రీ ఇవ్వబోతోంది. ఇర్ఫాన్ ఖాన్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న 'బ్లాక్ మెయిల్' చిత్రంలోని 'బెవాఫా బ్యూటీ' అనే పాటతో ఆమె దాదాపు దశాబ్దం తర్వాత తన ఫ్యాన్స్‌ని మళ్లీ అలరించనుందని డీఎన్ఏ కథనం పేర్కొంది. ఈ పాటని రేపు ఆవిష్కరించనున్నారు.

బాల నటిగా తన కెరీర్‌ను ప్రారంభించిన ఊర్మళ 1990ల్లో బాలీవుడ్‌ను ఓ ఊపు ఊపేసింది. అడపాదడపా దక్షిణాది సినిమాల్లోనూ ఆమె తళుక్కుమంది. షారూఖ్ ఖాన్ హీరోగా 1992లో రిలీజైన 'చమత్కార్' ఆమె చేసిన తొలి బాలీవుడ్ సినిమా. అయితే 1995లో అమీర్‌తో చేసిన 'రంగీలా' చిత్రం ఆమెకు చక్కటి గుర్తింపును తీసుకొచ్చింది. కెరీర్ నుంచి విరామం తీసుకున్నాక ఈ ముద్దుగుమ్మ మార్చి 3, 2016న కశ్మీర్ వ్యాపారి, మోడల్ మొహ్‌సిన్ అక్తర్ మీర్‌ను వివాహం చేసుకుంది.

Bollywood
Urmila matondkar
Blackmail
Bewafa Beauty
Irrfan Khan
  • Loading...

More Telugu News