sarath kumar: మోసానికి గురైన శరత్ కుమార్ మొదటి భార్య!

  • శరత్ కుమార్ మొదటి భార్య పేరు శారదాదేవి
  • క్రెడిట్ కార్డు నంబరు తెలుసుకుని, నగదు విత్ డ్రా చేసిన దుండగుడు
  • పోలీసులను ఆశ్రయించిన శారదాదేవి

ప్రముఖ సినీ నటుడు, సమత్తువ మక్కల్ కట్చి పార్టీ అధినేత శరత్ కుమార్ మొదటి భార్య శారదాదేవి (57) ఛీటింగ్ కు గురయ్యారు. చెన్నైలోని కొట్టూరు గార్డెన్ మూడో మెయిన్ రోడ్డులో ఆమె నివసిస్తున్నారు. ఓ ప్రైవేటు బ్యాంకుకు చెందిన ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి ఈ నెల 19వ తేదీన ఆమెను ఫోన్ ద్వారా సంప్రదించాడు. ఆమె క్రెడిట్ కార్డు నెంబరును అడగ్గా... ఆమె ఏమీ ఆలోచించకుండా నెంబర్ ను ఇచ్చేశారు. వెంటనే ఆమె అకౌంట్ లో ఉన్న నగదును ప్రవీణ్ డ్రా చేసేశాడు. నగదు విత్ డ్రా అయినట్టు తెలుసుకున్న ఆమె... అదే నంబరుకు ఫోన్ చేయగా... స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో, మోసపోయాననే విషయాన్ని ఆమె గ్రహించారు. వెంటనే కొట్టూరుపురం పోలీస్ స్టేషన్ లో ఆమె ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

sarath kumar
first wife
sarada devi
credit card
Cheating
  • Loading...

More Telugu News