Chandrababu: ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ పై చంద్రబాబుకు ఫిర్యాదు చేసిన ఎంపీ మురళీమోహన్

  • నటీనటులను టార్గెట్ చేసిన రాజేంద్రప్రసాద్
  • అందరికీ బాధ కలిగిందన్న మురళీమోహన్
  • తాను మాట్లాడతానని ఊరడించిన చంద్రబాబు

తెలుగు చిత్ర పరిశ్రమలోని నటీ నటులను టార్గెట్ చేస్తూ టీడీపీ నేత బాబూ రాజేంద్రప్రసాద్ చేసిన విమర్శలు తనతో సహా పరిశ్రమలోని ఎందరినో బాధించాయని ఎంపీ మురళీమోహన్ ఏపీ సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. ఈ ఉదయం చంద్రబాబు నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఆయన, రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలను సీఎం దృష్టికి తీసుకొచ్చారు.

ఆయన అలా మాట్లాడి ఉండాల్సింది కాదని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని సినీ పరిశ్రమలోని ఎందరో ఇప్పటికే డిమాండ్ చేశారని మురళీమోహన్ వ్యాఖ్యానించారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ, తాను స్వయంగా రాజేంద్రప్రసాద్ తో మాట్లాడతానని, ఇకపై ఈ తరహా విమర్శలు వద్దని చెబుతానని వెల్లడించారు. కాగా, ఏపీ ప్రజల డబ్బులు తింటున్న సినీ పరిశ్రమ, హోదా కోసం ఒక్క నిరసన కూడా చేయలేదని, ప్రభుత్వానికి అండగా నిలవలేదని బాబూ రాజేంద్రప్రసాద్ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. 

Chandrababu
babu Rajendra Prasad
Murali Mohan
Tollywood
Special Category Status
  • Loading...

More Telugu News