Posani Krishna Murali: పవన్ ఆరోపణలను నేను నమ్ముతున్నాను: పోసాని

  • బహిరంగ సభలో ఆరోపణలు చేశాడంటే నిజం ఉండే ఉంటుంది
  • బాబుతో కలిసి ఉంటే పవన్ కు బోలెడు ప్రయోజనాలు 
  • వాటిని వదులుకున్నాడంటే ఆలోచించాల్సిందే

జనసేన ఆవిర్భావ సభ సందర్భంగా టీడీపీపై పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణల పట్ల ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళి స్పందించారు. చంద్రబాబుతో కలిసి ఉంటే పవన్ కల్యాణ్ పనులన్నీ అయిపోతాయని, బాబుతో కలిసి ఉంటే ఇంట్లో కూర్చొని ఒక్క ఫోన్ కొడితే పనులు వాటంతట అవే అయిపోతాయని అన్నారు.

అంతే కాకుండా ఆయన కోరుకుంటే చాలా ప్రయోజనాలు ఉంటాయని పోసాని చెప్పారు. అలాంటి వాటిని పక్కనపెట్టి బహిరంగ సభలో నేరుగా ఆరోపణలు చేశాడంటే వాటిలో నిజం ఉండే ఉంటుందని, పవన్ ఆరోపణలను తాను నమ్ముతున్నానని పోసాని స్పష్టం చేశారు. అవినీతి జరగలేదని చెప్పే టీడీపీ నేతలు, ప్రాజెక్టుల్లో ఖర్చు పెట్టిన ప్రతిపైసాకి లెక్క చెప్పి తమ నిజాయతీని నిరూపించుకోవాలని ఆయన సూచించారు. 

Posani Krishna Murali
Jana Sena
Telugudesam
  • Loading...

More Telugu News