viral photo: పరీక్ష హాలుకి చంటిబిడ్డతో వచ్చి.. పాలిస్తూ పరీక్ష రాసిన మహిళ.. ఫొటో వైరల్‌

  • అఫ్గనిస్థాన్‌కు చెందిన 25 ఏళ్ల జహాన్
  • రెండు నెలల క్రితమే బిడ్డకు జన్మనిచ్చిన జహాన్‌
  • ఉన్నత చదువుల కోసం తాజాగా ఎంట్రెన్స్‌ పరీక్ష రాసిన మహిళ
  • పరీక్ష రాస్తుండగా పాలకోసం ఏడ్చిన బిడ్డ

అఫ్గనిస్థాన్‌కు చెందిన 25 ఏళ్ల జహాన్ అనే మహిళ తన చంటి బిడ్డను ఒడిలో ఉంచుకుని పరీక్ష రాసిన సంఘటనకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. జహాన్ తాబ్ అనే మహిళకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆమె భర్త ఓ రైతు. పెళ్లి జరిగినప్పటికీ ఆమెకు ఉన్నత విద్యను అభ్యసించాలనే కోరిక ఉండేది. దీంతో పట్టు విడవకుండా చదువును కొనసాగిస్తోంది. తాజాగా ఆమె సోషల్‌ సైన్స్‌ కోర్స్ లో చేరడానికి ఓ యూనివర్సిటీ నిర్వహించిన ఎంట్రెన్స్ టెస్ట్ రాయాలనుకుంది. ఆ పరీక్ష తేదికి రెండు నెలల ముందే ఆమె మూడో బిడ్డకు జన్మనిచ్చింది.

దీంతో ఆమె తన బిడ్డను తీసుకుని పరీక్షా కేంద్రానికి వచ్చింది. పరీక్ష రాస్తుండగా ఆమె బిడ్డ పాల కోసం ఏడవడంతో కుర్చీలోంచి లేచి బిడ్డను తీసుకుని వచ్చి కింద కూర్చొని పాలిస్తూ పరీక్ష రాసింది. ఓ లెక్చరర్ ఆ ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఈ ఫొటో ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయింది. ఆ లెక్చరర్ కొన్ని కారణాలతో తన పోస్ట్ ను డిలీట్ చేసినప్పటికీ అప్పటికే ఈ ఫొటోను చాలా మంది షేర్ చేశారు.

viral photo
afghanistan
mother
  • Error fetching data: Network response was not ok

More Telugu News