Rahul Gandhi: మోదీ పక్కన కూర్చునేవారంతా జైలు పక్షులే!: రాహుల్ గాంధీ

  • ఇక్కడకు వచ్చి నీతి గురించి మోదీ మాట్లాడతారు
  • ఆయన పక్కన ఉండేవారంతా జైలుకెళ్లి వచ్చినవారే
  • హెలీప్యాడ్లు, ఎయిర్ పోర్టులు కట్టుకుంటూ చైనా దూసుకుపోతోంది
  • మోదీ మాత్రం మౌనంగా కూర్చున్నారు

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. చిక్ మగళూరులో నిర్వహించిన ఓ బహిరంగసభలో ఆయన ప్రసంగిస్తూ, మోదీ ఇక్కడకు వచ్చి నీతి గురించి చాలా గొప్పగా మాట్లాడతారని... కానీ, స్టేజ్ పై ఆయన పక్కన కూర్చునే నేతలందరూ జైలుకెళ్లి వచ్చిన వారే అనే విషయాన్ని గమనించాలని చెప్పారు.

బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి సహా పలువురు కీలక నేతలు అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చినవారేనని ఎద్దేవా చేశారు. సరిహద్దులో ఉన్న డోక్లాం ప్రాంతంలో హెలీప్యాడ్లు, ఎయిర్ పోర్టులు కట్టుకుంటూ చైనా ముందుకు సాగుతుంటే... మోదీ మౌనంగా ఎందుకు ఉన్నారని మండిపడ్డారు. 1978లో చిక్ మగళూరు నుంచి తన నాయనమ్మ ఇందిర పోటీ చేస్తే, ఇక్కడి ప్రజలంతా ఆమెకు మద్దతుగా నిలిచారని చెప్పారు. ఆ విషయాన్ని తాను మర్చిపోనని... ప్రజలకు ఎలాంటి అవసరమున్నా తాను అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు. 

Rahul Gandhi
Narendra Modi
karnataka
elections
china
doklam
chik magalur
  • Loading...

More Telugu News