BJP: బీజేపీకి అనుకూలంగా అన్నాడీఎంకే వ్యవహరిస్తోంది: టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ ఆరోపణ

  • అవిశ్వాసంపై చర్చ చేపట్టకుండా కేంద్ర ప్రభుత్వం పారిపోతోంది
  • చర్చ కోసం ప్రతిరోజు ప్రయత్నిస్తున్నాం
  • కేంద్ర ప్రభుత్వంతో పాటు లోక్‌సభ స్పీకర్ ప్రజాస్వామ్యంతో ఆడుకుంటున్నారు

అవిశ్వాస తీర్మానంపై చర్చ చేపట్టకుండా కేంద్ర ప్రభుత్వం పారిపోతోందని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. ఈ రోజు అన్నాడీఎంకే, టీఆర్‌ఎస్ ఎంపీల నిరసనల మధ్య లోక్‌సభ రేపటికి వాయిదాపడిన విషయం తెలిసిందే. అనంతరం పార్లమెంటు వెలుపల గల్లా జయదేవ్ మీడియాతో మాట్లాడుతూ... లోక్‌సభలో అన్నాడీఎంకే ఎంపీలు బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, చర్చ జరగనివ్వకుండా అడ్డుతగులుతున్నారని వ్యాఖ్యానించారు. తాము ప్రతిరోజు అవిశ్వాస తీర్మానంపై నోటీసులు ఇస్తున్నా పార్లమెంటులో చర్చ జరపడం లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు లోక్‌సభ స్పీకర్ ప్రజాస్వామ్యంతో ఆడుకుంటున్నారని ఆయన విమర్శించారు.

BJP
Telugudesam
galla jaydev
  • Loading...

More Telugu News