somu veerraju: ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నారన్న వార్తలపై సోము వీర్రాజు స్పందన

  • ఆ వార్తలన్నీ అవాస్తవం
  • ఎమ్మెల్యేలంతా రాజీనామా చేస్తే.. నేను కూడా చేస్తా
  • రెండు పార్టీలు కలసి పోటీ చేసి, అధికారంలోకి వచ్చాయి

ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు వచ్చిన నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తన పదవికి రాజీనామా చేయనున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలపై వీర్రాజు స్పందిస్తూ... అదంతా తప్పుడు ప్రచారమేనని కొట్టిపారేశారు. గత ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలు కలసి పోటీ చేసి అధికారంలోకి వచ్చాయని చెప్పారు. ఎమ్మెల్యేల కోటాలో తాను ఎమ్మెల్సీగా ఎన్నికయ్యానని... ముఖ్యమంత్రి చంద్రబాబు సహా ఎమ్మెల్యేలంతా రాజీనామా చేస్తే... తాను కూడా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని తెలిపారు.

చంద్రబాబు, టీడీపీపై యుద్ధం చేయాలంటూ ఢిల్లీలోని బీజేపీ పెద్దలు తమను ప్రోత్సహిస్తున్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేఎల్పీ నేత విష్ణుకుమార్ రాజు అన్నారు. యుద్ధం చేయాలని తమకు ఎవరూ చెప్పలేదని తెలిపారు. 

somu veerraju
Chandrababu
resignation
mlc
  • Loading...

More Telugu News