Karnataka: కేఆర్ నియోజకవర్గం టికెట్ కావాలి: బీజేపీని కోరిన కన్నడ నటి మాళవిక

  • 2013లో బీజేపీలో చేరిన మాళవిక అవినాశ్
  • పార్టీలో చేరిన నాటి నుంచి చురుగ్గా పనులు
  • మైసూర్ లోని కేఆర్ నగర్ టికెట్ ఆశిస్తున్నట్టు ప్రకటన

కర్ణాటక ఎన్నికల్లో మైసూరులోని కే.ఆర్‌ నియోజక వర్గం నుంచి టికెట్‌ ఆశిస్తున్నానని ప్రముఖ సినీ నటి, బీజేపీ నేత మాళవిక అవినాశ్‌ తెలిపారు. మైసూరులో ఆమె మాట్లాడుతూ, టికెట్ పై పార్టీ అధిష్ఠానాన్ని కోరామని సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నానని అన్నారు. 2013లో బీజేపీలో చేరిన మాళవిక పార్టీలో చురుగ్గా పని చేస్తూ ఆకట్టుకున్నారు. గత కొంత కాలంగా ఆమె పోటీ చేస్తారంటూ వార్తలు వెలువడుతున్నప్పటికీ ఆమె స్పందించలేదు. అయితే అకస్మాత్తుగా పోటీ చేస్తానని ప్రకటించడమే కాకుండా, మైసూర్ లోని కే.ఆర్ నియోజకవర్గం టికెట్ ఆశిస్తున్నానని పేర్కొనడం విశేషం.

Karnataka
BJP
malavika avinash
  • Loading...

More Telugu News