Jeevan Reddy: టీడీపీ అవిశ్వాసంపై టీఆర్ఎస్ ఎంఎల్ఏ జీవన్ రెడ్డి తీవ్ర విమర్శలు

  • కేంద్రంపై అవిశ్వాస తీర్మానానికి టీడీపీ తమను సంప్రదించలేదని వ్యాఖ్య
  • 2014లో బీజేపీతో పొత్తు సందర్భంగా కూడా తమను సంప్రదించలేదని విమర్శ
  • తెలంగాణకు అన్యాయం జరిగితే టీడీపీ ఎప్పుడైనా మాట్లాడిందా? అని సూటి ప్రశ్న

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించకుండా మాట తప్పారంటూ కేంద్రంలోని ఎన్‌డీయే సర్కార్‌పై టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై టీఆర్ఎస్ ఎంఎల్ఏ జీవన్ రెడ్డి ఈ రోజు తీవ్ర విమర్శలు చేశారు. అవిశ్వాసంపై ఆ పార్టీ రాద్ధాంతం చేస్తోందని ఆయన విమర్శించారు. 2014లో బీజేపీతో పొత్తు సందర్భంగా టీడీపీ తమను సంప్రదించిందా? అని ఆయన ప్రశ్నించారు.

అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టే విషయంలో తమ నాయకుడు కేసీఆర్‌ను టీడీపీ సంప్రదించిందా? అని ఆయన ప్రశ్నించారు. కేంద్రంతో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడూ పొత్తు పెట్టుకోలేదని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగితే టీడీపీ ఎప్పుడైనా మాట్లాడిందా? అని కూడా ఆయన ప్రశ్నించారు. కేంద్రంపై తిరుగుబాటు చేస్తుంటే టీడీపీ తమతో ఎందుకు కలవడం లేదో చెప్పాలని ఆయన నిలదీశారు.

Jeevan Reddy
TRS
Telugudesam
Centre
BJP
Non-Confidence motion
  • Loading...

More Telugu News