kapunadu: కాపు సామాజిక వర్గానికి ఆ దుర్గతి పట్టించకండి: పవన్ కల్యాణ్ కు కాపునాడు అధ్యక్షుడి విజ్ఞప్తి

  • పవన్ కల్యాణ్ కు సూచన చేసిన కాపునాడు అధ్యక్షుడు పిళ్లా వెంకటేశ్వరరావు
  • చిరంజీవి నాటి పరిస్థితులు కాపు సామాజిక వర్గానికి ఎదురు కానివ్వొద్దు
  • ఆ పరిస్థితులు ఎదురైతే మరో పాతికేళ్ల వరకు కాపులు తలెత్తుకు తిరగలేరు

పవన్‌ కల్యాణ్‌ రూపంలో మరోసారి చిరంజీవి రాజకీయ ప్రవేశం నాటి పరిస్థితులు కాపు సామాజిక వర్గానికి ఎదురైతే, సభ్యసమాజంలో మరో పాతికేళ్ల వరకూ కాపు సామాజిక వర్గం తలెత్తుకు తిరగలేని పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తుందని కాపునాడు అధ్యక్షుడు పిళ్లా వెంకటేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు.

విజయవాడలో ఆయన మాట్లాడుతూ, కాపు సామాజిక వర్గానికి ఆ దుస్థితిని కల్పించవద్దని పవన్‌ కల్యాణ్‌ కు విజ్ఞప్తి చేశారు. సీఎం చంద్రబాబునాయుడు పోరాటాన్ని బలహీనపరిచే ఏ చర్య అయినా, కాపు సామాజిక వర్గ ప్రయోజనాలను దెబ్బతీస్తుందని భావిస్తున్నానని ఆయన హెచ్చరించారు. బాబు నాయకత్వాన్ని బలపరచవలసిన తరుణంలో పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలు ఆందోళనకు గురిచేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. బీజేపీ భావాలకు వకాల్తా పుచ్చుకుని, కాపు సామాజిక వర్గానికి ద్రోహం చేయవద్దని ఆయన పవన్ కల్యాణ్ కు సూచించారు.

kapunadu
Vijayawada
pilla venkateswararao
Andhra Pradesh
  • Loading...

More Telugu News