rajanikanth: నా వెనుక ఉన్నది బీజేపీ కాదు..!: రజనీకాంత్

  • పెరియార్ విగ్రహం ధ్వంసం చేయడం అనాగరికం
  • హిమాలయాల యాత్ర చాలా ప్రశాంతంగా జరిగింది
  • చెన్నైలో విలేకరులతో మాట్లాడిన రజనీకాంత్

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ త్వరలో తన రాజకీయ పార్టీని ప్రకటించనున్న విషయం తెలిసిందే. రజనీ ఏర్పాటు చేయనున్న రాజకీయ పార్టీ వెనుక బీజేపీ ఉందనే అనుమానాలు ఉన్న నేపథ్యంలో రజనీ చెప్పిన సమాధానం ఆసక్తిదాయకంగా ఉంది. హిమాలయాల పర్యటన ముగించుకుని ఈరోజు చెన్నై చేరుకున్న రజనీకాంత్ మీడియాతో మాట్లాడారు.

హిమాలయాల యాత్ర చాలా ప్రశాంతంగా జరిగిందని, తనకు కొత్త శక్తి నిచ్చిందని అన్నారు. తన వెనుక బీజేపీ ఉందని కొందరు ఆరోపిస్తున్నారని, ఆ వ్యాఖ్యలు తప్పవని, తన వెనుక ఉన్నది ‘దేవుడు’ అని రజనీ పేర్కొన్నారు. తన రాజకీయ ప్రయాణానికి సంబంధించి మీడియా ఎన్ని ప్రశ్నలు వేసినా తాను చెప్పే సమాధానమిదేనని అన్నారు. కాగా, తమిళనాడు రాష్ట్రంలో పెరియార్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన సంఘటనపై రజనీకాంత్ స్పందిస్తూ, ఈ సంఘటనను ఖండిస్తున్నానని, ఇటువంటి అనాగరిక సంఘటన జరగకుండా ఉండాల్సిందని అన్నారు.

rajanikanth
Tamilnadu
  • Loading...

More Telugu News