radhika apte: దక్షిణాదిలో హీరోలు వచ్చేవరకు సెట్లో ఎదురు చూస్తూ కూర్చోవాలి!: రాధికా ఆప్టే

  • దక్షిణాది హీరోలు చాలా పవర్ ఫుల్
  • హీరోకంటే రెండు గంటల ముందే సెట్స్ కు రావాలి
  • హీరో కోసం ఎదురు చూస్తూ కూర్చోవాలి

‘రక్తచరిత్ర’, ‘లయన్‌’, ‘లెజెండ్’ చిత్రాల్లో నటించి ఆకట్టుకున్న రాధికా ఆప్టేకు బోల్డ్ స్టేట్ మెంట్స్ ఇచ్చే నటిగా పేరుంది. తాజాగా ఆమె దక్షిణాది చిత్రపరిశ్రమపై తీవ్ర విమర్శలు చేస్తూ కలకలం రేపుతోంది. నేహా ధూపియా హోస్ట్ చేస్తున్న ‘నో ఫిల్టర్’ ఛాట్ లో ఆమె మాట్లాడుతూ, కెరీర్ ఆరంభంలో దక్షిణాది సినిమాల్లో నటించానని చెప్పింది. అక్కడ ఇబ్బందికర వాతావరణం ఉంటుందని తెలిపింది.

పారితోషికం బాగానే ఇస్తారు కానీ, దానికి తగ్గట్టే కష్టం కూడా ఉంటుందని పేర్కొంది. దక్షిణాదిలో హీరోలు చాలా పవర్ ఫుల్ అని చెప్పింది. హీరో కంటే రెండు గంటల ముందు హీరోయిన్ సెట్ కు రావాల్సి ఉంటుందని, హీరోలు వచ్చేవరకు ఎదురు చూస్తూ కూర్చోవాలని చెప్పింది. అక్కడ కాస్త భిన్నంగా ట్రీట్ చేస్తారని తెలిపింది.

radhika apte
Tollywood
contravercy comments
  • Loading...

More Telugu News