iaf: ఒడిశాలో కుప్పకూలిన భారత యుద్ధ శిక్షణ విమానం

  • ఒడిశా-జార్ఖండ్ రాష్ట్రాల సరిహద్దులో ప్రమాదం
  • శిక్షణలో ఉండగా అదుపుతప్పిన విమానం
  • పైలట్ కు గాయాలు

భారత వైమానిక దళానికి చెందిన హాక్ అడ్వాన్స్డ్ ట్రైనర్ జెట్ విమానం మంగళవారం కుప్పకూలింది. ఒడిశాలోని మయూర్ భంజ్ జిల్లాలో జార్ఖండ్ సరిహద్దులకు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. పశ్చిమబెంగాల్ లోని ఖరగ్ పూర్ లో ఉన్న కలైకుంద వైమానిక దళ స్టేషన్ నుంచి సాధారణ శిక్షణలో భాగంగా ఈ శిక్షణ విమానం బయలుదేరింది.

అయితే ఒడిశాలోని మయూర్ భంజ్ ప్రాంతంలో ప్రయాణిస్తున్న సమయంలో అదుపుతప్పింది. దీంతో శిక్షణలో ఉన్న పైలట్ వెంటనే ఎజెక్ట్ (సీటుతో సహా విమానంలోంచి బయటపడి.. పారాచూట్ ద్వారా కిందికి దిగడం) అయ్యారని వైమానిక దళ వర్గాలు వెల్లడించాయి. అయితే పైలట్ స్వల్పంగా గాయపడ్డారని, ఈ ఘటనపై విచారణకు ఆదేశించారని తెలిపాయి.

దాదాపు నెల రోజుల కింద అసోంలో భారత వైమానిక దళానికి చెందిన మైక్రోలైట్ వైరస్ ఎస్ డబ్ల్యూ-80 హెలికాప్టర్ కూలిపోయి.. ఇద్దరు వింగ్ కమాండర్లు మరణించిన విషయం తెలిసిందే. నెల రోజుల్లోనే మరో ప్రమాదం జరగడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.

  • Loading...

More Telugu News