rajendra prasa: ఏజ్ బార్ అయిన హీరోల్లారా.. హీరోయిన్ వెంటపడే క్యారెక్టర్లకే మీరు పనికొస్తారు!: ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్

  • అవార్డులు రాకపోతే రచ్చరచ్చ చేస్తారు
  • ఏపీ ప్రజల కష్టాలు మీకు పట్టవా?
  • ఏపీ ప్రజలు మిమ్మల్ని వెలివేస్తారు

ప్రత్యేక హోదా కోసం తెలుగు హీరోలు ఎందుకు పోరాడటం లేదని టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ మండిపడ్డారు. ఎవరికైనా అవార్డు రాకపోతే రచ్చ రచ్చ చేస్తారని... భూమి, ఆకాశాలు బద్దలైనట్టు వ్యవహరిస్తారని... ఇంటర్వ్యూలపై ఇంటర్వ్యూలు ఇస్తారని... ఇక్కడ మా ఆంధ్ర ప్రజలకు రివార్డులు రావడం లేదయ్యా... నిధులు రాక ఎన్నో ఇబ్బందులు పడుతున్నామయ్యా... మీ కళ్లకు కనబడటం లేదా? ఏసీ రూముల్లో కులుకుతూ కూర్చుంటారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంస్కారం అడ్డొస్తోందని.. లేకపోతే ఇంకా కఠినంగా మాట్లాడేవాడినని అన్నారు.

ఏజీ బార్ అయిన హీరోలూ... మీకు ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు పట్టవా? అంటూ తీవ్ర విమర్శలు చేశారు. మీది హాలీవుడ్ స్థాయి కాదని... హీరోయిన్ వెంటపడే క్యారెక్టర్లకే మీరు పనికొస్తారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  ప్రత్యేక హోదా కోసం పోరాడకుంటే... ఏపీ ప్రజలు మిమ్మల్ని వెలివేసేస్తారంటూ హెచ్చరించారు. ఇప్పటికైనా మౌనం వీడాలని సూచించారు.

rajendra prasa
Telugudesam mlc
Tollywood
heros
Special Category Status
warning
  • Loading...

More Telugu News