Narendra Modi: బీజేపీ కుట్రలో టీఆర్ఎస్ ఎందుకు భాగస్వామి అయిందో అర్థం కావడం లేదు: టీడీపీ

  • మోదీ, షా భయంతో కుట్రలకు పాల్పడుతున్నారు
  • అన్నాడీఎంకేతో ఆందోళనలు చేయిస్తున్నారు
  • అవిశ్వాసంపై చర్చ జరుగుతుందనే నమ్మకం నాకు లేదు

కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ, బీజేపీలు ప్రవేశపెట్టిన అవిశ్వాసంపై ఇంతవరకు చర్చ చేపట్టని విషయం తెలిసిందే. అన్నాడీఎంకే, టీఆర్ఎస్ ఎంపీలు చేపడుతున్న ఆందోళనలను బూచిగా చూపుతూ, సభను స్పీకర్ సుమిత్రా మహాజన్ వాయిదా వేస్తున్నారు. ఈ అంశంపై టీడీపీ ఎమ్మల్సీ రాజేంద్రప్రసాద్ స్పందిస్తూ, ఒక వ్యూహాత్మకంగా, ఉద్దేశపూర్వకంగా బీజేపీ ఈ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. అన్నాడీఎంకే ఎంపీలతో సభలో గొడవ చేయిస్తోందని అన్నారు.

బీజేపీ కుట్రలో టీఆర్ఎస్ ఎందుకు భాగస్వామి అయిందో తనకు అర్థంకాకుండా ఉందని రాజేంద్రప్రసాద్ చెప్పారు. అవిశ్వాసంపై చర్చ జరిగితే ఎన్డీయే వైఫల్యాలను విపక్షాలు ఎండగడతాయనే భయంతోనో... చర్చ తర్వాత ఓటింగ్ జరిగితే వాళ్లకు బలం ఉన్నప్పటికీ, అద్వానీ పట్ల మోదీ వ్యవహరించిన తీరును నిరసిస్తూ బీజేపీ సీనియర్లు, బలమైన నేతలు ఓటింగ్ కు గైర్హాజరు కావడమో, లేక వ్యతిరేకంగా ఓటేస్తారనే భయంతోనే బీజేపీ ఉందని అన్నారు. ఈ నాలుగేళ్ల కాలంలో మోదీ, అమిత్ షాలు భయపడటం, పారిపోవడం తొలిసారి స్పష్టంగా కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. సభను వాయిదా వేయకుండా, కొనసాగిస్తారనే నమ్మకం తనకు ఎంతమాత్రం లేదని అన్నారు.

  • Loading...

More Telugu News