sasikala pushpa: మళ్లీ పెళ్లి చేసుకోనున్న తమిళనాడు ఎంపీ శశికళ పుష్ప.. వెడ్డింగ్ కార్డ్ వైరల్!

- ఈనెల 26న ఢిల్లీలో వివాహం
- రామస్వామిని పెళ్లాడబోతున్న శశికళ
- లింగేశ్వర్ తో తొలి వివాహం
అన్నాడీఎంకే బహిష్కృత రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్ప మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారు. రామస్వామి అనే వ్యక్తిని ఈమె పెళ్లాడబోతున్నారు. ఈనెల 26వ తేదీన ఢిల్లీలోని ఓ స్టార్ హోటల్ లో వీరి వివాహం జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ప్రారంభమయ్యాయి. వివాహానికి సంబంధించిన వెడ్డింగ్ కార్డ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
