diabetic: మధుమేహాన్ని గుర్తించే కొత్త ప్రమాణాలపై భారతీయ వైద్యుల ఆందోళన

  • మధుమేహం అని గుర్తించే ప్రమాణాల సడలింపు
  • 7-8 శాతం మధ్య హెచ్ బీఏ1సీ ఉంటేనే మధుమేహం
  • అమెరికన్ కాలేజీ ఆఫ్ ఫిజీషియన్స్ సూచన
  • వీటిని పట్టించుకోవద్దన్నది మన వైద్యుల సూచన

మధుమేహంపై అంతర్జాతీయంగా వెలువడిన తాజా మార్గదర్శకాల పట్ల భారతీయ వైద్యుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిపై వైద్య వర్గాల్లోనే వివాదం నెలకొని ఉంది. దీనంతటికీ కారణం అమెరికన్ కాలేజీ ఆఫ్ ఫిజీషియన్స్ (వైద్యుల సంఘం) మధుమేహాన్ని గుర్తించే విషయంలో ప్రమాణాలను సడలించడమే. సాధారణంగా హెచ్ బీఏ1సీ అనే పరీక్షలో గడిచిన మూడు నెలలుగా రక్తంలో గ్లూకోజ్ స్థాయులు ఏ విధంగా ఉన్నదీ సగటున తెలుస్తుంది. వైద్యులు ఈ పరీక్షను సిఫారసు చేస్తుంటారు. 6 శాతం లోపుంటే మధుమేహం లేనట్టు. 6-6.5 శాతం మధ్య ఉంటే తొలి దశ మధుమేహంలో ఉన్నట్టు. 6.5 శాతం కంటే ఎక్కువ ఉంటే దాన్ని మధుమేహంగా పరిగణనలోకి తీసుకుని చికిత్స చేస్తున్నారు.

అయితే అమెరికన్ కాలేజీ ఆఫ్ ఫిజీషియన్స్ 7-8 శాతం మధ్య ఉంటేనే వారిని టైప్-2 మధుమేహులుగా గుర్తించాలని సూచించింది. ప్రస్తుతం ఇది 6.5-7 శాతంగా ఉంది. దీన్ని వైద్య వర్గాల్లో కొందరు వ్యతిరేకిస్తున్నారు. ఈ నూతన మార్గదర్శకాలు గందరగోళానికి, చికిత్స విషయంలో అయోమయానికి దారితీస్తాయన్నది మన వైద్యుల ఆందోళన. కనుక వీటిని పట్టించుకోవక్కర్లేదని అంటున్నారు. 2017 నాటికి మన దేశంలో 7.2 కోట్ల మంది మధుమేహులు ఉన్నట్టు ప్రపంచ డయాబెటిస్ ఫెడరేషన్ గణాంకాలు చెబుతున్నాయి.

  • Loading...

More Telugu News