Parliament: మోదీ బ్యాడ్ బాయ్... దేవాంశ్, నేను కలసి స్కేలుతో కొట్టేస్తాం... పెన్సిల్ తో ముఖాన్ని గీకేస్తాం: చిన్న పిల్లాడి వేషంలో శివప్రసాద్

  • నిత్యమూ ఒక్కో వేషంలో వచ్చి నిరసన తెలుపుతున్న ఎంపీ
  • తనదైన శైలిలో విమర్శలు గుప్పించిన శివప్రసాద్
  • మోదీ అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ, నిత్యమూ ఒక్కో వేషంలో పార్లమెంట్ కు వచ్చి నిరసనలు తెలుపుతున్న చిత్తూరు ఎంపీ, నటుడు శివప్రసాద్ నేడు ఓ లాగు, చొక్కా వేసుకుని, తలకు స్కూల్ బ్యాగ్ తగిలించుకుని, చేత్తో పుస్తకాలు, పెన్సిల్ తో స్కూలు విద్యార్థి వేషంలో వచ్చారు.

ఆపై తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తూ, "మోదీని కొట్టేత్తాం. బ్యాడ్ బాయ్. మోదీ బ్యాడ్ బాయ్. చంద్రబాబునాయుడు తాత మా ఫ్యూచర్ కోసం కష్టపడుతుంటే, ఫండ్స్ ఇవ్వరా? స్టేటస్ ఇవ్వరా? ఏమీ ఇవ్వకపోతే ఎట్టమ్మా? ఎట్టా డెవలప్ అయ్యేది? మా ఫ్యూచర్ ఎట్లా? దేవాంశ్ మేము టీమున్నాము. అందరూ కలిసి ఈ స్కేలుతో కొట్టేస్తాము. ఈ పెన్సిల్ తో ముఖమంతా గీకేస్తాము. ఏమనుకున్నారో? అన్నీ ఇవ్వాలి" అన్నారు చిన్న పిల్లాడిలా అనుకరిస్తూ.

ఆపై ఆయన మాట్లాడుతూ, నేడు ఐదారు తరగతులు చదువుతున్న విద్యార్థులు కూడా మోదీని అసహ్యించుకుంటున్నారని ఆరోపించారు. మోదీ అర్థం చేసుకోవాలని, వెంటనే రాష్ట్రానికి హోదాను ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Parliament
Chittore MP
Siva Prasad
School Children
Special Category Status
  • Loading...

More Telugu News