Mahesh Babu: మహేశ్ బాబు గురించి కైరా అద్వాని ఏమందంటే .. !

  • మహేశ్ బాబు అంకితభావం గురించి విన్నాను 
  • ఈ సినిమాతో ప్రత్యక్షంగా చూశాను 
  • సెట్లో చాలా సరదాగా వుంటారు

మహేశ్ బాబుతో పనిచేసిన కథానాయికలు ఆయన వ్యక్తిత్వం గురించి .. అంకితభావం గురించి గొప్పగా చెబుతూ ఉండటం సహజంగానే జరుగుతూ ఉంటోంది. అలా ఆయన గురించి గొప్పగా చెప్పిన కథానాయికల జాబితాలో తాజాగా కైరా అద్వాని కూడా చేరిపోయింది. 'భరత్ అనే నేను' సినిమాలో మహేశ్ సరసన కథానాయికగా ఆమె నటిస్తోంది.

 మహేశ్ బాబు గురించి ఆమె మాట్లాడుతూ .. "మహేశ్ బాబు అంకితభావం గురించి నేను విని వున్నాను .. ఈ సినిమాలో నటించే అవకాశం రావడం వలన ప్రత్యక్షంగా చూశాను. సెట్లో ఆయన వుంటే చాలా సరదాగా వుంటుంది .. ఎలాంటి ఫిర్యాదులు వుండవు. ఈ సినిమా కోసం ఆయన రెండు రోజుల పాటు లంచ్ కూడా చేయకుండా కష్టపడటం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది" అంటూ చెప్పుకొచ్చింది.  ఈనెల 25 నుంచి ఈ సినిమా చివరి షెడ్యూల్ స్పెయిన్ లో జరగనుంది.     

Mahesh Babu
kiara adwani
  • Loading...

More Telugu News