mohammad shami: వివాహితుడితో ఏ మహిళైనా హోటల్ కు వెళ్తుందా?: షమీ భార్య హసీన్

  • అలీషబా నా వైవాహిక జీవితాన్ని నాశనం చేయాలని ప్రయత్నిస్తోంది
  • అలీషబా నా భర్త స్నేహితురాలు, అభిమాని కాదు
  • వివాహితుడితో ఏ మహిళ అయినా పడకగదిని పంచుకుంటుందా?

టీమిండియా క్రికెటర్‌ మహమ్మద్‌ షమీకి తాను పెద్ద అభిమానినని, అభిమానుల్లో ఒకరిగా అతనిని దుబాయ్ లో కలుసుకున్నానని పాకిస్థానీ మహిళ అలీషబా వ్యాఖ్యల నేపథ్యంలో మహ్మద్ షమీ భార్య హసిన్‌ జహాన్‌ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. అలిపోర్‌ కోర్టు మేజిస్ట్రేట్‌ ముందు వాంగ్మూలం ఇచ్చేందుకు హాజరైన అనంతరం ఆమె సీఎంవో అధికారులను కలిసి సీఎం మమతా బెనర్జీ అపాయింట్ మెంట్ కోరారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తన భర్తకు వివాహేతర సంబంధాలు చాలా ఉన్నాయని అన్నారు. పాకిస్థానీ యువతి అలీషబా తన వైవాహిక జీవితాన్ని నాశనం చేయాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అలీషబా షమీ స్నేహితురాలు కానీ, అభిమాని కానీ కాదని ఆమె స్పష్టం చేశారు. వివాహమైన వ్యక్తితో ఏ మహిళ అయినా హోటల్‌ లో గడుపుతుందా? అని ఆమె ప్రశ్నించారు. అతని పడకగదిని పంచుకుంటుందా? అని ఆమె నిలదీసింది.

mohammad shami
haseen jahan
Cricketer
India
  • Loading...

More Telugu News