Gurugram: సీక్రెట్ ఆపరేషన్ చేసి షాపింగ్ మాల్ లో సాగుతున్న సెక్స్ రాకెట్ ను బట్టబయలు చేసిన అధికారి!

  • మాల్ లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం
  • కస్టమర్ వేషంలో వెళ్లిన అధికారి
  • ఆరుగురు మహిళలు సహా 9 మంది అరెస్ట్

ఓ భారీ షాపింగ్ మాల్ లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న సెక్స్ రాకెట్ ను పోలీసు అధికారి సీక్రెట్ ఆపరేషన్ ద్వారా బట్టబయలు చేసిన ఘటన గురుగ్రామ్ పరిధిలో జరిగింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, గురుగ్రామ్ లోని ఓమెక్స్ మాల్ లో ఓయిస్టర్ పేరిట నిర్వహిస్తున్న బ్యూటీ స్పాలో జరుగుతున్న వ్యభిచార దందా జరుగుతూ ఉండగా, ఉప్పందుకున్న ఓ అధికారి కస్టమర్ లా వెళ్లాడు.

స్పా మేనేజర్ తో బేరం కుదుర్చుకుని, అక్కడ వ్యభిచారం నిజమేనని తేల్చుకుని, గదిలోపలికి వెళ్లిన తరువాత అక్కడికి సమీపంలోనే ఉన్న తన టీమ్ ను అలర్ట్ చేశారు. ఈ రైడ్ లో మొత్తం 9 మందిని అరెస్ట్ చేశామని, అందులో ఆరుగులు మహిళలు ఉన్నారని, స్పా యజమానులు మాత్రం పట్టుబడలేదని పోలీసులు తెలిపారు. కేసును విచారిస్తున్నట్టు పేర్కొన్నారు.

Gurugram
Shopping Mall
S*x Rocket
Omex Mall
  • Error fetching data: Network response was not ok

More Telugu News