kereala: ఏ మతాన్ని అనుసరించాలన్నది పెద్దయ్యాక నా కొడుకే నిర్ణయించుకుంటాడు: కేరళ ఫుట్ బాలర్

  • కేరళీయుల అభిమాన ఫుట్ బాలర్ వినీత్
  • పండంటి బాబుకు జన్మనిచ్చిన వినీత్ భార్య
  • బాబు జనన ధృవీకరణ పత్రంలో మతం కాలమ్ వద్ద నిల్ గా పేర్కొన్న వినీత్

ఏ మతం అవలంబించాలన్న విషయమై పెద్దైన తరువాత తన కొడుకే నిర్ణయం తీసుకుంటాడని ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్ఎల్) లో కేరళ బ్లాస్టర్స్‌‌ తరఫున ఫుట్‌ బాల్ ఆడుతున్న వినీత్‌ (29) తెలిపాడు. కేరళలోని కన్నూరుకు చెందిన వినీత్ కు ఆ రాష్ట్రంలో విశేషమైన అభిమానులున్నారు. ఆయన భార్య ఇటీవల పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ నేపథ్యంలో జనన జనన ధ్రువీకరణ పత్రంలో బిడ్డది ఏ మతమో వెల్లడించే కాలమ్ వద్ద నిల్‌ (ఏదీలేదు) అని రాయడం ఆసక్తి రేపుతోంది.

దీనిపై ఆయనను ప్రశ్నించగా, ‘ప్రపంచం అంతటికీ ఒకటే మతం ఉంది. అయితే, పాటించే విధానంలోనే వివిధ రకాలు కనిపిస్తాయి’ అని చెప్పిన బెర్నాడ్‌షా సూక్తిని స్ఫూర్తిగా తీసుకున్నానని తెలిపాడు. మతం గురించి తన కొడుకుదే అంతిమ నిర్ణయమని స్పష్టం చేశాడు. వాడు పెద్దయ్యాక ఏ మతం నచ్చితే దానిని అనుసరిస్తాడని తెలిపాడు.

kereala
isl
football player
vineet
  • Loading...

More Telugu News