shiva sena: బీజేపీ భ్రమలను టీడీపీ తొలగించింది: శివసేన

  • మరోపాతికేళ్లు కేంద్రంలో తమదే అధికారమన్న భ్రమలో బీజేపీ
  • అవిశ్వాస తీర్మానంతో బీజేపీ భ్రమలను తొలగించిన టీడీపీ
  • జాతీయ ప్రయోజనాల కోసం కాకుండా వ్యక్తిగత కారణాలతో అవిశ్వాసం

బీజేపీ భ్రమలను టీడీపీ తొలగించిందని శివసేన వ్యాఖ్యానించింది. మరో పాతికేళ్లపాటు కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఎవరూ కదిలించలేరన్న బీజేపీ భ్రమలను పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం ద్వారా టీడీపీ బద్దలు కొట్టిందని ఎన్డీఏ మరో భాగస్వామ్య పక్షమైన శివసేన సొంత పత్రిక సామ్నా సంపాదకీయంలో పేర్కొంది.

కేంద్ర ప్రభుత్వంపై మిత్రపక్షాల్లో అపనమ్మకం ఏర్పడిందని సామ్నా తెలిపింది. కేంద్ర ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ఎన్నికల సమయంలో అది భగ్గుమంటుందని సామ్నా అభిప్రాయపడింది. అయితే, టీడీపీ అవిశ్వాస తీర్మానాన్ని జాతీయ కారణాలతో పెట్టలేదని, కేవలం వ్యక్తిగత కారణాలతోనే అవిశ్వాసం ప్రతిపాదించిందని సామ్నా పత్రిక వ్యాఖ్యానించింది

shiva sena
BJP
Telugudesam
samna
  • Loading...

More Telugu News