madhaveelata: పవన్ కల్యాణ్ 'జనసేన'కు సపోర్ట్ చేస్తా!: 'నచ్చావులే' హీరోయిన్

  • పవన్ కల్యాణ్ అంటే ఇష్టమని గత పదేళ్లుగా చెబుతున్నాను
  • సమాజ సేవన్నా ఇష్టమే
  • పవన్ జనసేనకు సపోర్ట్ చేస్తా 

ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మరో సినీ హీరోయిన్ మద్దతు పలికింది. గతంలో కత్తి మహేష్ వివాదం సమయంలో పవన్ కల్యాణ్ కు మద్దతుగా పూనమ్ కౌర్ స్పందించిన సంగతి తెలిసిందే. తాజాగా ‘నచ్చావులే’ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన మాధవీలత తన ఫేస్ బుక్ పేజ్ ద్వారా పవన్ కల్యాణ్ కు మద్దతు తెలిపింది.

"పవన్ అంటే నాకు ప్రేమ అని గత పదేళ్లుగా ప్రతీ ఇంటర్వ్యూలో చెబుతున్నాను. అలాగే నాకు సమాజసేవ అన్నా చాలా ఇష్టం. అందుకే ‘నక్షత్ర ఫౌండేషన్‌‌’ను ప్రారంభించాను. కానీ సపోర్టు మరియు ఫండింగ్స్ లేక సర్వీస్‌‌ కు బ్రేక్ ఇచ్చాను. కానీ, సేవ చేయాలనే ఆశ మాత్రం చావలేదు. పవన్ అంటే నాకు అంత ఇష్టం ఉన్నప్పుడు, ఆయన స్థాపించిన ‘జనసేన’ పార్టీకి నేను ఎందుకు సపోర్టు చేయకూడదు? అనిపిస్తోంది. పవన్ కోసం నేను దేనికైనా రెడీఅంటూ ఫేస్ బుక్ లో మాధవీలత పోస్టు పెట్టింది.  

madhaveelata
madhavi
actress
nachavule fame
  • Loading...

More Telugu News