Natarajan: శశికళ భర్త నటరాజన్ కన్నుమూత.. జైలులో కన్నీటి పర్యంతమైన చిన్నమ్మ

  • కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నటరాజన్
  • గతేడాది అక్టోబరులో కిడ్నీ మార్పిడి ఆపరేషన్ 
  • పెరోల్ కోసం దరఖాస్తు చేసుకున్న శశికళ

గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వీకే శశికళ భర్త ఎం.నటరాజన్ (73) సోమవారం అర్ధరాత్రి దాటాక కన్నుమూశారు. మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న ఆయన గత అక్టోబరులో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్నారు. మార్చి 16న అనారోగ్యంతో చెన్నైలోని గ్లోబల్ ఆసుపత్రిలో చేరిన ఆయన పరిస్థితి విషమించడంతో మంగళవారం తెల్లవారుజామున 1:30 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. ఆయన ప్రాణాలను కాపాడేందుకు చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయని గ్లోబల్ హెల్త్ సిటీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ షణ్ముగ ప్రియన్ తెలిపారు.

1975లో శశికళను వివాహం చేసుకోవడానికి ముందు నటరాజన్ పీఆర్వోగా పనిచేశారు. విద్యార్థిగా ఉన్నప్పుడు హిందీ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నారు. జయలలితకు రాజకీయ సలహాదారుగానూ పనిచేశారు. భర్త నటరాజన్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలియడంతో శశికళ సోమవారం పెరోల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అంతలోనే ఆయన మరణవార్తతో కన్నీటి పర్యంతమయ్యారు.

Natarajan
AIADMK
Sasikala
Tamilnadu
  • Loading...

More Telugu News