modi: మోదీకి, చంద్రబాబుకు ఎప్పుడూ పడదు : ఉండవల్లి అరుణ్ కుమార్

  • వాళ్లిద్దరికి పడకపోవడానికి కారణాలు బాహాటంగా తెలిసినవే! 
  • నాడు ఏపీ భవన్ లో మోదీకి చంద్రబాబు ఇంటర్వ్యూ ఇవ్వలేదట
  • ‘గోద్రా’ ఘటన తర్వాత మోదీని పదవి నుంచి తప్పించాలని బాబు చూశారు : ఉండవల్లి

ప్రధాని మోదీకి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి ఎప్పుడూ పడదని ప్రముఖ రాజకీయవేత్త ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ‘ఐ డ్రీమ్స్’ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘బాహాటంగా తెలిసిన కారణాలు .. గతంలో మోదీ హైదరాబాద్ లో దిగితే బేగంపేట ఎయిర్ పోర్ట్ లోనే ఆయన్ని అరెస్టు చేస్తామని నాడు చంద్రబాబునాయుడు గవర్నమెంట్ ప్రకటించింది. గోద్రా అల్లర్ల తర్వాత సీఎంగా ఉన్న మోదీని పదవిలో నుంచి దించేయాలని నాడు వాజ్ పేయిని చంద్రబాబు కలిశారు. చంద్రబాబు ఇంటర్వ్యూ కోసం నాడు ఏపీ భవన్ వద్దకు మోదీ వస్తే ఇంటర్వ్యూ ఇవ్వలేదని, రెండు గంటలు కూర్చుని మోదీ వెళ్లిపోయాడని చెబుతుంటారు. ఈ విషయం నాకు కరెక్ట్ గా తెలియదు కానీ, చెబుతుంటారు. ఇలాంటి సంఘటనలేవో మోదీని కించపరిచాయి’ అన్నారు ఉండవల్లి.

modi
Chandrababu
Undavalli
  • Loading...

More Telugu News