mamatha: బలమైన ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటవుతుంది: కేసీఆర్‌తో భేటీ తరువాత మమతా బెనర్జీ

  • భావసారూప్యత ఉన్న మిత్రులందరితోనూ చర్చలు జరుపుతాం
  • దేశాభివృద్ధి కోసం కేసీఆర్ తో కలిసి విస్తృతంగా చర్చలు
  • పరిస్థితులే నాయకులను సృష్టిస్తాయి
  • ఏ నిర్ణయం తీసుకున్నా అది దేశాభివృద్ధిని దృష్టిలో ఉంచుకునే తీసుకుంటాం

త్వరలోనే బలమైన ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటవుతుందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. ఈ రోజు కోల్‌కతాలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో మమతా బెనర్జీ దేశ రాజకీయాలపై చర్చించిన విషయం తెలిసిందే. అనంతరం మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడుతూ... భావసారూప్యత ఉన్న మిత్రులందరితోనూ చర్చలు జరుపుతామని తెలిపారు.

దేశాభివృద్ధి కోసం కేసీఆర్ తో కలిసి విస్తృతంగా చర్చించానని తెలిపారు. పరిస్థితులే నాయకులను సృష్టిస్తాయని, దేశ రాజకీయాల్లో ఇదో శుభపరిణామమని తెలిపారు. తాము దేశాభివృద్ధిపై మాత్రమే కాకుండా రైతుల సమస్యలపై కూడా చర్చించామని చెప్పారు. తాము ఏ నిర్ణయం తీసుకున్నా అది దేశాభివృద్ధిని దృష్టిలో ఉంచుకునే తీసుకుంటామని తెలిపారు.  

  • Loading...

More Telugu News