Bangladesh: 'ఏం పర్లేదు! టైమ్ తీసుకో' అని మాత్రమే చెప్పాను: షకిబల్ హసన్

  • ఫైనల్ ఓవర్ లో సౌమ్యకి పెద్దగా సలహాలివ్వలేదు
  • అలాంటప్పుడు పెద్దగా సలహాలివ్వకూడదు
  • ఓటమికి ఎవరినీ నిందించబోవడం లేదు

నిదాహస్ టోర్నీ ఫైనల్ లో చివరి ఓవర్ పై బంగ్లాదేశ్ కెప్టెన్ షకిబల్ హసన్ స్పందించాడు. చివరి బంతి వేసేముందు సౌమ్య సర్కార్ కు తానేమీ చెప్పలేదని షకిబల్ తెలిపాడు. చివరి బంతికి ముందు సౌమ్య దగ్గరకి వెళ్లి, 'ఏం పర్లేదు కొంచెం సమయం తీసుకుని బంతి వెయ్యి' అని చెప్పానని అన్నాడు. ఆ సమయంలో బౌలర్‌ కు సలహాలు ఇవ్వకపోవడమే మంచిదని అన్నాడు.

వాస్తవానికి ఈ మ్యాచ్‌ లో సౌమ్య బ్రహ్మాండంగా బౌలింగ్ వేశాడన్నాడు. ఈ ఓటమికి ఎవరినీ నిందించబోవడం లేదని చెప్పాడు. చివరి రెండు ఓవర్లే తమ కొంప ముంచాయని చెప్పాడు. టోర్నీ ఆద్యంతం బౌలింగ్, ఫీల్డింగ్ రంగాల్లో జట్టు అద్భుతంగా రాణించిందని అన్నాడు.

Bangladesh
Cricket
shakib-al-hassan
  • Loading...

More Telugu News