ram madhav: రాజకీయ నాటకాల్లో చంద్రబాబును మించినవారు లేరు: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్

  • చంద్రబాబు సొంత మామనే మోసం చేశారు
  • రాజకీయ నాటకాల్లో ఆయనను మించినవారు లేరు
  • రాజకీయాల్లో ఫ్రంట్ లు ఏర్పడటం సాధారణ విషయమే

తెలుగుదేశం పార్టీ రాజకీయ నాటకాలు ఆడుతోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ అన్నారు. ఏపీ ప్రజల కోసం చేయాల్సినవన్నీ చేస్తామని చెప్పారు. నిన్నటి వరకు టీడీపీతో కలసి ఉన్న పవన్ కల్యాణ్, ఎందుకు దూరమయ్యారో ఓ సారి ఆలోచించుకోవాలని చెప్పారు. సొంత మామనే మోసం చేసిన ఘనత చంద్రబాబుదని... రాజకీయ గిమ్మిక్కుల్లో ఆయన ఆరితేరారని తెలిపారు.

రాజకీయ నాటకాల్లో చంద్రబాబును మించినవారు మరెవరూ లేరని ధ్వజమెత్తారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన డిమాండ్లను తాము పట్టించుకున్నామని... కానీ, రాజకీయ ప్రయోజనాల కోసం టీడీపీ ఆటలు ఆడుతోందని విమర్శించారు. భారత రాజకీయాల్లో ఫ్రంట్ లు ఏర్పడటం సాధారణ విషయమేనని... రానున్న రోజుల్లో ఏ ఫ్రంట్ వస్తుందో చూద్దామని అన్నారు. 

ram madhav
Chandrababu
Pawan Kalyan
  • Loading...

More Telugu News