Tenth Question papers Leakage: 10th ఇంగ్లిష్ ప్రశ్నాపత్రం లీక్... టీచర్ పనే!

  • ఆదిలాబాద్, వనపర్తి జిల్లాల్లో పదో తరగతి ఇంగ్లిష్ ప్రశ్నాపత్రం లీక్
  • సెల్ ఫోన్ లో ఫోటో తీసిన టీచర్ వాట్స్ యాప్ ద్వారా షేర్
  • విచారణకు ఆదేశించిన విద్యాశాఖ

తెలంగాణలోని ఆదిలాబాద్, వనపర్తి జిల్లాల్లో పదో తరగతి ఇంగ్లిష్ ప్రశ్నాపత్రం లీకేజీ కలకలం రేపుతోంది. నేటి ఉదయం పరీక్షకు అరగంట ముందు ఇంగ్లిష్ ప్రశ్నాపత్రం విద్యార్థుల సెల్ ఫోన్లలో ప్రత్యక్షమైంది. ఒక టీచర్ లీకేజీకి పాల్పడినట్టు తెలుస్తోంది. సెల్ ఫోన్ లో ఫొటో తీసి, దానిని విద్యార్థులకు పంపినట్టు తెలుస్తోంది. ఇది ఇతర ఫోన్లకు సర్క్యులేట్ కావడంతో కలకలం రేగింది.

అది ఆ నోటా ఈ నోటా చేరి, విద్యాశాఖాధికారులకు తెలిసింది. దీంతో అప్రమత్తమైన విద్యాశాఖాధికారులు స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులను రంగంలోకి దించారు. దీనిపై రెండు జిల్లాల కలెక్టర్లు, డీఈవోలతో ఫోన్ లో మాట్లాడిన విద్యాశాఖ కమిషనర్, ప్రశ్నాపత్రం లీకైన సెంటర్ల సూపరింటెండెంట్‌, ఇన్విజిలేటర్లు, విద్యార్థులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.

Tenth Question papers Leakage
tenth exams
Criminal cases
  • Loading...

More Telugu News