anasuya: సోషల్ మీడియాలో రీఎంట్రీ ఇచ్చిన హాట్ యాంకర్ అనసూయ!

  • నెటిజెన్ల విమర్శలతో మనస్తాపానికి గురైన అనసూయ
  • ఫిబ్రవరి 6న నుంచి సోషల్ మీడియాకు దూరం
  • రీఎంట్రీ ఇచ్చి.. రంగమ్మత్త ఫొటోను అప్ లోడ్ చేసిన జబర్దస్త్ భామ

జబర్దస్త్ భామ, సినీ నటి అనసూయ సోషల్ మీడియాలోకి రీఎంట్రీ ఇచ్చింది. తన కుమారుడు ఫొటో తీస్తుంటే సెల్ ఫోన్ పగలగొట్టి, దుర్భాషలాడిందంటూ ఓ మహిళ గతంలో అనసూయపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశం సోషల్ మీడియాలో వైరల్ కాగా... పలువురు నెటిజన్లు ఆమె వ్యవహారశైలి పట్ల విరుచుకుపడ్డారు.

సదరు మహిళ తనపై దుష్ప్రచారం చేస్తోందంటూ అనసూయ చెప్పినప్పటికీ... నెటిజన్ల దాడి కొనసాగింది. దీంతో, కొంత కాలం పాటు ట్విట్టర్, ఫేస్ బుక్ కు దూరంగా ఉంటున్నట్టు అనసూయ ప్రకటించింది. ఫిబ్రవరి 6వ తేదీన తన అకౌంట్లను డిజేబుల్ చేసింది. తాజాగా ఇప్పుడు రీఎంట్రీ ఇచ్చింది. ఫేస్ బుక్ అకౌంట్ ను నిన్న యాక్టివేట్ చేసి, 'రంగస్థలం' ట్రైలర్ ను అప్ లోడ్ చేసింది. ట్విట్టర్ అకౌంట్ ను ఈ రోజు యాక్టివేట్ చేసిన అనసూయ... 'రంగస్థలం'లో తాను పోషించిన రంగమ్మత్త ఫొటోను పోస్ట్ చేసింది. 

anasuya
anchor
twitter
facebook
re entry
  • Loading...

More Telugu News