Galla Jayadev: మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతోంది: గల్లా జయదేవ్

  • ఎన్డీయే ఆడించినట్టు ఆడుతున్న స్పీకర్
  • చర్చకు సిద్ధమంటున్న రాజ్ నాథ్
  • సభను వాయిదా వేయాలని స్పీకర్ కు సూచనలు
  • ట్విట్టర్ లో ఆరోపించిన గల్లా జయదేవ్

లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, ఎన్డీయే ప్రభుత్వం ఆడించినట్టు ఆడుతున్నారని తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్ విమర్శించారు. అవిశ్వాస తీర్మానంపై ఓ వైపు చర్చకు సిద్ధమని రాజ్ నాథ్ సింగ్ చెబుతున్నారని గుర్తు చేసిన జయదేవ్, మరోవైపు సభను వాయిదా వేయాలని స్పీకర్ కు సూచిస్తున్నారని, ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్యం హత్యకు గురవుతోందని, సభను నడిపించే విషయంలో స్పీకర్ కు, ఎన్డీయే పెద్దలకు మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని అన్నారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ ను పెట్టారు. ప్రభుత్వం చెప్పినట్టుగానే స్పీకర్ వ్యవహరిస్తున్నారని, అందువల్లే తమ అవిశ్వాస తీర్మానాలు చర్చకు రావడం లేదని వ్యాఖ్యానించారు.

Galla Jayadev
Twitter
Lok Sabha
Sumitra Mahajan
Rajnath Singh
  • Error fetching data: Network response was not ok

More Telugu News