Kaveri river: టీడీపీ, వైసీపీ సభ్యులు కూర్చుంటే... వెల్ లో నినాదాలు చేసిన టీఆర్ఎస్, అన్నాడీఎంకే!

  • అవిశ్వాసంపై చర్చ కోసం వేచి చూసిన టీడీపీ, వైసీపీ
  • రిజర్వేషన్ల అంశంపై టీఆర్ఎస్ నిరసనలు
  • కావేరీ బోర్డు కోసం అన్నాడీఎంకే ఎంపీల నినాదాలు

నేడు లోక్ సభలో అవిశ్వాసంపై చర్చకు అనుమతిస్తారన్న ఉద్దేశంతో తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ సభ్యులు ఎటువంటి నినాదాలు చేయకుండా తమ తమ స్థానాల్లో కూర్చున్నప్పటికీ, రిజర్వేషన్లను సవరించుకునే అధికారాన్ని రాష్ట్రాలకే ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర సమితి, కావేరీ బోర్డు కోసం అన్నాడీఎంకే సభ్యులు తమ నిరసన గళాన్ని వినిపించారు. వెల్ లోకి దూసుకొచ్చిన అన్నాడీఎంకే, టీఆర్ఎస్ సభ్యులు ప్లకార్డులు పట్టుకుని, తమ డిమాండ్లు తీర్చాలంటూ నినాదాలు చేశారు. దీంతో సభను నడిపించేందుకు తనకు అవకాశం ఇవ్వాలని స్పీకర్ సుమిత్రా మహాజన్ పదే పదే విజ్ఞప్తి చేశారు. ఎవరూ వినే పరిస్థితి లేకపోవడంతో సభను వాయిదా వేశారు. 

Kaveri river
Telugudesam
YSRCP
TRS
Reservations
Lok Sabha
  • Loading...

More Telugu News