Telugudesam: టీడీపీ అవిశ్వాస తీర్మానానికి జై కొట్టిన స్టాలిన్... అన్నాడీఎంకేకూ అదే సూచన

  • ఆంధ్రప్రదేశ్ సంక్షేమం కోసం టీడీపీ అవిశ్వాస తీర్మానం
  • కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్న ప్రయత్నం
  • దీనికి అన్నాడీఎంకే సర్కారు కూడా మద్దతు ఇవ్వాలని హితవు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా వంచన చేసిన మోదీ సర్కారుకు వ్యతిరేకంగా పోరాడుతున్న టీడీపీకి నైతిక బలం పెరుగుతోంది. ఒక్కో పార్టీ టీడీపీకి మద్దతు పలుకుతున్నాయి. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ మద్దతు ప్రకటించగా, తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాలు కూడా మద్దతు ఇస్తామని పేర్కొన్నాయి. తమిళనాడులోని విపక్ష డీఎంకే కూడా మద్దతు పలికింది.

ఆ పార్టీ ముఖ్య నేత ఎంకే స్టాలిన్ ఇందుకు సంబంధించి టీడీపీకి పూర్తి మద్దతుగా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్న ఉద్దేశంతోనే టీడీపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతోందని స్టాలిన్ పేర్కొన్నారు. టీడీపీ అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని అన్నాడీఎంకే సర్కారును కోరుతున్నట్టు చెప్పారు. ఈ మేరకు ఆయన ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడారు. 

Telugudesam
NO confidence motion
mk stalin
dmk
  • Error fetching data: Network response was not ok

More Telugu News