allu arjun: బన్నీ మూవీలో ఫోక్ నంబర్ చేసిన స్వీడిష్ భామ

  • 'నా పేరు సూర్య'లో ఫోక్ నెంబర్ 
  • ఎల్లి అవ్రామ్ కు దక్కిన ఛాన్స్ 
  • ఈ అవకాశం దక్కడం పట్ల ఆమె ఆనందం    

వక్కంతం వంశీ దర్శకత్వంలో 'నా పేరు సూర్య' రూపొందుతోంది. దేశభక్తి నేపథ్యంలో కొనసాగే ఈ సినిమాలో అల్లు అర్జున్ .. ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణ జరుపుకుంది. ఈ సినిమాలో ఐటమ్ నంబర్ ఉండకపోవచ్చనే టాక్ బయటికి వచ్చింది. దేశభక్తి నేపథ్యంతో కథ ఉండటం వలన .. కథాగమనానికి ఈ సాంగ్ అడ్డుపడుతోందని భావించి, ఐటమ్ సాంగ్ ను వద్దనుకున్నట్టుగా ప్రచారం జరిగింది.

అయితే జానపద బాణీలో సాగే ఒక పాటను చిత్రీకరించారనేది తాజా సమాచారం. ఈ సాంగ్ ను స్వీడిష్ భామ 'ఎల్లి అవ్రామ్' పై చిత్రీకరించారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమెనే వెల్లడించడం జరిగింది. ఈ పాటలో ఆమె మాత్రమే డాన్స్ చేస్తుందట. తనకి బన్నీ డాన్స్ అంటే చాలా ఇష్టమనీ, అయితే ఆయనతో కలిసి డాన్స్ చేయాలనే కోరిక మాత్రం నెరవేరలేదని ఎల్లి చెప్పింది. బన్నీ సినిమాలో ఛాన్స్ రావడాన్ని అదృష్టంగా భావిస్తున్నానంటూ ఆనందాన్ని వ్యక్తం చేసింది.   

allu arjun
elli avram
  • Loading...

More Telugu News